జైలు నుంచి శశికళ విడుదల 

అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత స్నేహితురాలు వీకే శశికళ జైలు జీవితం నేటితో ముగియనుంది. అవినీతికి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమెను.....

Updated : 27 Jan 2021 14:54 IST

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో ఈమె నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. కరోనా బారిన పడ్డ శశికళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. మరో 10 రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. 

జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్​ తెలిపారు. ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు ఏవీ లేవని వెల్లడించారు. 

ఇవీ చదవండి...

హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఏమార్చి... వ్యూహం మార్చి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని