Rahul Gandhi: ఆయన క్షమాపణలు చెప్పారని నిరూపించండి: రాహుల్‌కు సావర్కర్‌ మనవడి సవాల్‌

ఇటీవల రాహుల్‌ గాంధీ  (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు సావర్కర్‌ మనవడు రంజిత్‌  తీవ్రంగా స్పందించారు. తన తాత బ్రిటిష్‌ వారికి క్షమాపణలు చెప్పారని సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్‌కి ఆయన సవాల్‌ విసిరారు. 

Published : 28 Mar 2023 12:05 IST

ముంబయి: వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  దీనిపై తాజాగా సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ నేతపై తీవ్రంగా మండిపడ్డారు. తన తాత గురించి తప్పుగా మాట్లాడినందుకు మండిపడ్డారు.

ఈ సందర్భంగా రాహుల్‌కు ఆయన ఓ సవాల్‌ విసిరారు. దేశ భక్తుడు.. హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్‌ ఎప్పుడు బ్రిటిష్‌ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్‌ చేశారు. దానికి సంబంధించిన పత్రాలను చూపించాలన్నారు.  రాహుల్‌ వ్యాఖ్యలు పిల్లల మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు.  రాజకీయ ప్రచారం కోసం దేశభక్తుల పేర్లను వాడుకోవటం తప్పని దుయ్యబట్టారు.  ఇది చాలా పెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

‘మోదీ’ అనే ఇంటిపేరును కించపర్చారన్న కేసులో రాహుల్‌కు రెండేళ్లు జైలు శిక్ష పడటంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. తన అనర్హత వేటుపై ఇటీవల మీడియాతో మాట్లాడిన రాహుల్‌.. సావర్కర్‌ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘నేను సావర్కర్‌ను కాను.. గాంధీని..! గాంధీలు క్షమాపణలు చెప్పరు’అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని