CBSE: పరీక్షల రద్దుపై సుప్రీం విచారణ వాయిదా

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా 12వ తరగతి పరీక్షల

Published : 28 May 2021 11:48 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా 12వ తరగతి పరీక్షల రద్దుకు సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను  స్వీకరించిన జస్టిస్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 31వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసింది. 

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను జూన్‌ 1న ఖరారు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి పరీక్షలపై విద్యాశాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు సుప్రీం తీర్పుతో రాష్ట్రాల బోర్డులు కూడా 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 

12వ తరగతి పరీక్షలపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ.. రాష్ట్రాలతో సమావేశమైంది. జులై 15 నుంచి ఆగస్టు 28 వరకు వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే కరోనా దృష్ట్యా పరీక్షల నిర్వహణపై కేంద్రం రెండు ప్రతిపాదనలను సూచించింది. ఒకటి.. ముఖ్యమైన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించడం. రెండోది.. అన్నింటికీ పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు తగ్గించడం. చాలా రాష్ట్రాలు రెండో ప్రతిపాదనకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని