Supreme court: ఆ కమిషన్లలో ఖాళీల భర్తీలో జాప్యంపై ‘సుప్రీం’ ఆగ్రహం

రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీలు భర్తీలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.......

Updated : 22 Oct 2021 20:38 IST

దిల్లీ: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీలు భర్తీలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ట్రైబ్యునళ్ల నియామకం ఇష్టంలేకపోతే చట్టాన్ని రద్దుచేయాలంటూ జస్టిస్‌ ఎస్కే కౌల్‌,  జస్టిస్‌ ఎంఎం సుందరేషన్‌తో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ అధికార పరిధిని దాటి ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నామన్న న్యాయమూర్తులు.. ఈ విషయాన్ని తాము చెప్పాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఇది సంతోషించదగిన పరిణామం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర, జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పనపై సుమోటో కేసుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. 8 వారాల్లోగా ఖాళీలు భర్తీ చేయాలని ఆగస్టు 11న ఉత్తర్వులు జారీచేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని