Hemant Soren: ఈడీ సమన్లు.. సుప్రీంలో ఝార్ఖండ్‌ సీఎంకు షాక్‌

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈడీకి వ్యతిరేకంగా ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

Published : 18 Sep 2023 14:09 IST

దిల్లీ: ఝార్ఖండ్‌ (Jharkhand) ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇచ్చిన సమన్లను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై ఝార్ఖండ్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో సోరెన్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఓ మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసు (money laundering case)లో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు విచారణకు రావాలని ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ, ఆగస్టు 14, ఆగస్టు 24 తేదీల్లో ఆయను గైర్హాజరయ్యారు. దాంతో సెప్టెంబర్ 9న రాంచిలోని తమ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ మరోసారి సమన్లు ఇచ్చింది. అయితే, జీ20 సదస్సు నేపథ్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి విందుకు హాజరయ్యేందుకు సోరెన్‌ మరోసారి విచారణకు డుమ్మా కొట్టారు.

ఎంతో ప్రయాసతో తెలంగాణ ఏర్పాటు: లోక్‌సభలో ఏపీ విభజనను ప్రస్తావించిన మోదీ

ఈ క్రమంలోనే ఈ సమన్లను సవాల్‌ చేస్తూ హేమంత్‌ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ఈ సమన్లపై ఆయన ఇప్పుడు ఝార్ఖండ్‌ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఇక, రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సోరెన్‌ను గతేడాది నవంబరులో ఈడీ 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు