ఐటీ రూల్స్‌ కేసుల బదిలీపై 16న విచారణ

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ చట్టంలోని నిబంధనల చెల్లుబాటుపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలన్న కేంద్రం పిటిషన్‌పై....

Published : 09 Jul 2021 17:53 IST

దిల్లీ: కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ చట్టంలోని నిబంధనల చెల్లుబాటుపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలన్న కేంద్రం పిటిషన్‌పై ఈ నెల 16న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో పాటు ఓటీటీల నియంత్రణపై దాఖలైన పిటిషన్లపైనా అదే రోజు విచారణ జరపనుంది. ఈ అంశాన్ని సమర్థంగా విచారించే బెంచ్‌కు బదిలీ చేయనున్నట్లు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.

ఐటీ చట్టంలోని నిబంధనల చెల్లుబాటుపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో కేసులపై స్టే విధించి.. వాటిని సుప్రీంకు బదిలీ చేయాలని కోరుతూ కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందిస్తూ ఈ నెల 16న ఈ అంశంపై విచారణ జరపనున్నట్లు బెంచ్‌ పేర్కొంది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాల్సి ఉంటుంది. ఫిర్యాదుల అధికారిని నియమించాలి. దీంతోపాటు ఆన్‌లైన్‌ మీడియా పోర్టల్స్‌, ఓటీటీ వేదికలూ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఐటీ చట్టంలోని నిబంధనలపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లు దిల్లీ, మద్రాస్‌ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని