NEET: నీట్ పీజీ కౌన్సెలింగ్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ

నీట్ పీజీ కౌన్సెలింగ్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేంద్రం విజ్ఞప్తి మేరకు నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటాపై

Published : 04 Jan 2022 20:08 IST

దిల్లీ: నీట్ పీజీ కౌన్సెలింగ్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేంద్రం విజ్ఞప్తి మేరకు నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటాపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశాన్ని విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నుంచి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభ్యర్థనలు స్వీకరించింది. పీజీ కౌన్సెలింగ్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం విజ్ఞప్తి చేశారు. నీట్ పీజీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ వైద్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా అర్హతను పునఃసమీక్షించాలని కేంద్రం నిర్ణయించడంతో నీట్ పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ వాయిదా పడింది. కౌన్సిలింగ్‌లో జాప్యానికి వ్యతిరేకంగా దిల్లీ సహా దేశవ్యాప్తంగా రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని