ఒకే హాస్టల్‌లో 190 మందికి కరోనా!

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసుల విజృంభణ కొనసాగుతోంది. వషిమ్‌ జిల్లాలోని ఓ పాఠశాల వసతి గృహంలో 190 మందికి వైరస్‌ సోకింది. వైరస్‌ సోకిన వారిలో 186 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం.

Published : 25 Feb 2021 12:08 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసుల విజృంభణ కొనసాగుతోంది. వషిమ్‌ జిల్లాలోని ఓ పాఠశాల వసతి గృహంలో 190 మందికి వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది. వైరస్‌ సోకిన వారిలో 186 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. దీంతో అధికారులు పాఠశాల పరిసరాల్ని కంటైన్‌మెంట్‌‌ జోన్‌గా ప్రకటించారు. కాగా, వసతి గృహానికి వచ్చిన విద్యార్థుల్లో.. ఇటీవల మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందిన అమరావతి, యావత్మల్‌ జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. 

గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 8వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది మరణించారు. దేశంలో నమోదైన కేసుల్లో సగ భాగం మహారాష్ట్రలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 60వేలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్త ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముంబయి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని