కరోనా కట్టడికి.. సరికొత్త టీకా తయారీ విధానం

కరోనా కొత్త వేరియంట్లు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ వైరస్ కట్టడికి సరికొత్త టీకా తయారీ విధానాన్ని శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఇప్పటివరకు తయారైన టీకాలన్నీ రోగనిరోధకశక్తి, బీ సెల్స్ ఆధారంగా రూపొందించగా....

Published : 06 Jul 2021 22:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కొత్త వేరియంట్లు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ వైరస్ కట్టడికి సరికొత్త టీకా తయారీ విధానాన్ని శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఇప్పటివరకు తయారైన టీకాలన్నీ రోగ నిరోధకశక్తి, బీ సెల్స్ ఆధారంగా రూపొందించగా.. తొలిసారి టీ సెల్స్‌ను ప్రేరేపించటం ద్వారా వైరస్‌ను అడ్డుకునే పద్ధతిని పరిశోధకులు కనుగొన్నారు. కరోనా కొత్త వేరియంట్లను మరింత సమర్థంగా కట్టడి చేసే విధానం కోసం అమెరికాకు చెందిన బోస్టన్ విశ్వవిద్యాలయం, బ్రాడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. కరోనా సోకిన మానవ కణాలపై నిపుణులు ప్రయోగాలు చేశారు. అయితే బీ సెల్స్‌తో పోలిస్తే టీ సెల్స్‌ వైరస్ సోకిన కణాలను వేగంగా, సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా వైరస్ మూలాలను టీ సెల్స్  బాగా గుర్తుంచుకుంటున్నట్లు కనుగొన్నారు. వైరస్‌లో పుట్టుకొస్తున్న వేరియంట్లను సమర్థంగా అడ్డుకునే టీకాల తయారీకి తమ పరిశోధన ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని