
BrahMos: సీ టు సీ వేరియంట్ ‘బ్రహ్మోస్’ ప్రయోగంవిజయవంతం
ఇంటర్నెట్ డెస్క్: భారత నేవీకి చెందిన ఓ యుద్ధనౌక(స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్) నుంచి మంగళవారం చేపట్టిన అధునాతన సీ టు సీ వేరియంట్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమయింది. ఈ మేరకు డీఆర్‌డీఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు తెలిపింది. ‘సముద్రం నుంచి సముద్రంలోకి ప్రయోగించగల అడ్వాన్స్‌డ్ సీ టు సీ వేరియంట్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని నేడు ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ నుంచి విజయవంతంగా పరీక్షించాం. ఈ క్షిపణి నిర్దేశిత టార్గెట్‌గా ఉన్న ఓ నౌకను కచ్చితత్వంతో ఛేదించింది’ అని డీఆర్‌డీఓ ట్వీట్ చేసింది.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సిబ్బందికి అభినందనలు తెలిపారు. దేశ నావికాదళం సంసిద్ధత సామర్థ్యాన్ని ఇది మరోసారి నిరూపిస్తోందని ట్వీట్ చేశారు. భారత్, రష్యాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ ద్వారా ఈ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ధ్వని కంటే దాదాపు మూడు రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలవు. తాము తయారు చేస్తోన్న బ్రహ్మోస్‌తోపాటు ఇతర అధునాతన రక్షణ ఆయుధాలు ఇతర దేశాలపై దాడి చేసేందుకు కాదని, ఆ దేశాలు భారత్‌పై కన్నెత్తే సాహసం చేయకుండా ఉండేందుకేనని రాజ్‌నాథ్ ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
ED raids against Vivo: దేశవ్యాప్తంగా వివో కార్యాలయాల్లో ఈడీ సోదాలు
-
General News
Hyderabad News: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
-
Politics News
Teegala krishna reddy: మీర్‌పేట్‌ను మంత్రి సబిత నాశనం చేస్తున్నారు: తీగల తీవ్ర ఆరోపణలు
-
Business News
China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
-
Politics News
Kotamreddy: మురుగు కాల్వలో దిగి వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన
-
Sports News
IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
- Bumrah : బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. SENAపై అదరగొట్టేసిన టీమ్ఇండియా పేసర్