Amarnath Yatra: ఉగ్రదాడుల నేపథ్యంలో.. అమర్‌నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు

Published : 22 Jun 2024 21:45 IST

Amarnath Yatra | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra)కు జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir) సిద్ధమైంది. ఈ నెల 29న ప్రారంభం కానున్న యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచకంగా శనివారం నిర్వహించిన ‘ప్రథమ పూజ’లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. అమర్‌నాథ్‌ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో యాత్రికుల భద్రత విషయంలో సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్‌ హైవే వెంబడి భద్రత ఏర్పాట్లను జమ్మూ ఏడీజీపీ ఆనంద్‌ జైన్‌ సమీక్షించారు. ఉగ్రకార్యకలాపాలను కట్టడి చేసేందుకు నిరంతరం అప్రమత్తతంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తుల సమయంలో సత్వర చర్యలు చేపట్టేలా సహాయక సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్‌ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగనుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని