Republic Day: గణతంత్ర వేడుకల్లో నారీశక్తి.. ‘సీమా భవాని’ విన్యాసాలు అదరహో..

దేశ రాజధాని దిల్లీలో 73వ గణతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా రాజ్‌పథ్ మార్గంలో పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. పలు రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వశాఖల శకటాల ప్రదర్శన.. దేశ సంస్కృతి,

Updated : 26 Jan 2022 13:16 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో 73వ గణతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా రాజ్‌పథ్ మార్గంలో పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. పలు రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వశాఖల శకటాల ప్రదర్శన.. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. ఇక సరిహద్దు భద్రతా దళానికి చెందిన ‘సీమా భవాని మోటార్‌సైకిల్‌’ బృందం చేసిన విన్యాసాలు అదరహో అనిపించాయి. సరిహద్దు భద్రతా దళ మహిళా సిబ్బంది మోటార్‌ సైకిళ్లపై ప్రదర్శించిన విన్యాసాలను చూసి కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్‌, స్మృతి ఇరానీ సహా పలువురు ప్రముఖులు, వీక్షకులు లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. 

భారత వాయుసేన శకటంపై రఫేల్‌ తొలి మహిళా పైలట్‌..

పరేడ్‌లో భాగంగా భారత వాయుసేన శకటాన్ని ప్రదర్శించారు. ‘‘భవిష్యత్తు కోసం భారత వాయుసేన కొత్త రూపు’’ నేపథ్యంతో రూపొందించిన ఈ శకటంపై వాయుసేన రఫేల్‌ విమాలను నడిపిన తొలి మహిళా పైలట్‌ కన్పించడం విశేషం. దేశంలో రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందిన శివంగి సింగ్‌ ఈ శకటంపై సెల్యూట్‌ చేస్తూ కన్పించారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. వాయుసేన శకట ప్రదర్శనలో పాల్గొన్న రెండో మహిళా పైలట్‌ కూడా ఈమే. గతేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్‌ భావన కాంత్‌ వాయుసేన శకటంపై కన్పించిన తొలి మహిళగా ఘనత దక్కించుకున్నారు. వారణాసికి చెందిన శివంగి సింగ్‌ 2017లో వాయుసేనలో మహిళా పైలట్‌గా చేరారు. రఫేల్‌ కంటే ముందు మిగ్‌-21 బైసన్‌ విమానాన్ని నడిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని