కరోనా టీకా: సీరం, బయోటెక్ సంయుక్త ప్రకటన

కరోనావైరస్ టీకా పంపిణీ కార్యక్రమంలో కలిసి పనిచేస్తామని భారత్‌ బయోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతిజ్ఞ చేశాయి.

Published : 05 Jan 2021 17:54 IST

దిల్లీ: కరోనావైరస్ టీకా పంపిణీ కార్యక్రమంలో కలిసి పనిచేస్తామని భారత్‌ బయోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతిజ్ఞ చేశాయి. దానికి సంబంధించి రెండు సంస్థలు మంగళవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 

‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంయుక్తంగా కోవిడ్-19 టీకాలను భారత్‌, ప్రపంచానికి సజావుగా అందించే దిశగా ప్రతిజ్ఞ చేస్తున్నాయి’ అని ఆ ప్రకటన పేర్కొంది. టీకా తయారీ, పంపిణీ విషయంలో ఇరు సంస్థలు ఉమ్మడి ఉద్దేశాన్ని వెలిబుచ్చాయని వెల్లడించింది. ‘ప్రపంచం, భారత్‌లో జీవిస్తోన్న ప్రజల జీవితాలు, జీవనోపాధిని పరిరక్షించడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యం. తమ టీకాలకు జీవితాలను కాపాడే శక్తి ఉంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడాన్ని వేగవంతం చేస్తాయి’ అని ఆ ప్రకటనలో సీరం, భారత్‌ బయోటెక్ వెల్లడించాయి. తాము టీకాల తయారీ, సరఫరా, పంపిణీపై దృష్టి సారించామని తెలిపాయి. అవసరమైన జనాభాకు అధిక నాణ్యత, సురక్షితమైన, సమర్థవంతమైన టీకాలు అందిస్తామన్నాయి. టీకా కార్యక్రమం సజావుగా సాగేలా చూడటమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యవమని స్పష్టం చేశాయి. 

ఆదివారం భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర వినియోగం కింద ఈ రెండు సంస్థల టీకాలకు ఆమోదం లభించింది. 

ఇవీ చదవండి:

58కి చేరిన యూకే కరోనా కేసులు

ఇంగ్లండ్‌లో మళ్లీ లాక్‌డౌన్ 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని