కొవాక్స్‌కు వ్యాక్సిన్లు పంపిన సీరం

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 1.1 బిలియన్ల టీకాలను అందించనున్నట్లు గతంలో ప్రకటించింది.

Published : 23 Feb 2021 22:37 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా 1.1 బిలియన్ల టీకాలను అందించనున్నట్లు గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించిన మొదటి బ్యాచ్‌ వ్యాక్సిన్లను మంగళవారం ఉదయం సీరం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపింది. ఈ మేరకు డబ్య్లూహెచ్‌వో ఆగ్నేయాసియా విభాగం ట్విటర్‌లో తెలిపింది.

ప్రపంచఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌ (గవి)తో కలిసి నిర్వహించనున్న కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు 20శాతం వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థలకు చెందిన 1.1 బిలియన్ల వ్యాక్సిన్లను పంపేందుకు సీరం, గవితో ఒప్పందం చేసుకుంది. కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా 145 పేద, మధ్య ఆదాయ దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లను అందించనున్నారు. 336 మిలియన్ల ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్లను కూడా సమీకరించినట్లు యూనిసెఫ్‌ గతంలో ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని