సీరం నుంచి కొవాక్స్‌కు 1.1 బిలియన్ల టీకాలు

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థలకు చెందిన 1.1 బిలియన్ల టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనుంది.

Published : 19 Feb 2021 23:51 IST

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్‌ సంస్థలకు చెందిన 1.1 బిలియన్ల టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనుంది. ఈ మేరకు గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌( గవి)తో నొవావాక్స్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నొవావాక్స్‌ టీకాలను అభివృద్ధి చేసి పేద, మధ్య ఆదాయ దేశాలకు, రవాణా చేసేందుకు సీరంతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు చెందిన 240 మిలియన్ల డోసులను 3 డాలర్ల చొప్పున కొనేందుకు కొవాక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తాము కొవాక్స్‌ కార్యక్రమానికి 1.1 బిలియన్ల డోసులను అందిచనున్నట్లు సీరం గతంలో ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా 145 పేద, మధ్య ఆదాయ దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లను అందించనుంది. 336 మిలియన్ల ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్లను కూడా సమీకరించినట్లు యూనిసెఫ్‌ గతంలో వెల్లడించింది. ‘‘ఈ సమయంలో ప్రపంచానికి వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను అందించడమే మా లక్ష్యం’’ అని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌పూనావాలా ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని