డిసెంబర్‌ కల్లా సీరమ్‌ వ్యాక్సిన్‌: పునావాలా

పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందిస్తున్న కరోనా వైరస్‌ టీకా డిసెంబర్‌ కల్లా సిద్ధమవ్వచ్చని ఆ సంస్థ సీఈవో అధార్‌ పునావాలా తెలిపారు. వంద మిలియన్‌ డోసులు వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికానికి అందుబాటులోకి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Published : 28 Oct 2020 20:32 IST

దిల్లీ: పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందిస్తున్న కరోనా వైరస్‌ టీకా డిసెంబర్‌ కల్లా సిద్ధమవ్వచ్చని ఆ సంస్థ సీఈవో అధార్‌ పునావాలా తెలిపారు. వంద మిలియన్‌ డోసులు వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికానికి అందుబాటులోకి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. టీకా అందుబాటులోకి వచ్చే సరైన సమయం యూకేలో నిర్వహిస్తున్న ట్రయల్స్‌, డీసీజీఐ ఆమోదం వీటిపై ఆధార పడి ఉంటుందని తెలిపారు. 

అత్యవసర అనుమతికి దరఖాస్తు చేసుకోకపోతే.. డిసెంబర్ లో క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి.. వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో వ్యాక్సిన్ ను తీసుకువస్తాం. ఆ సమయానికి యూకేలోనూ ట్రయల్స్‌ పూర్తవుతాయి. టీకాపై వారి అధ్యయనానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుని సురక్షితమేనని అనుకున్నపుడు రెండు మూడు వారాల్లో అత్యవసర అనుమతికి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంటాం. అత్యవసర అనుమతికి దరఖాస్తు చేస్తే డిసెంబర్‌ నాటికి టీకా అందుబాటులోకి తెస్తాం. కానీ ఆ అంశం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుంది’ అని పునావాలా తెలిపారు.

అదేవిధంగా ఆయన మాట్లాడుతూ.. ‘100 మిలియన్‌ డోసులను అందుబాటులోకి తేవడం మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అది 2021 రెండు లేదా మూడో త్రైమాసికానికి పూర్తవుతుంది. వ్యాక్సిన్‌ రెండు డోసులుగా ఉంటుంది.. ఒక్కో డోసుకు మధ్య 28 రోజుల గడువు ఉంటుంది. టీకా ధర గురించి మేం ఇప్పుడే చెప్పలేం. ఆ విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. సీరం వ్యాక్సిన్‌ అనువైన ధరకే లభిస్తుందనే విషయం మాత్రం చెప్పగలను’ అని అధార్‌ పునావాలా చెప్పారు. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని