దీప్‌ సిద్ధూకి 7 రోజుల పోలీస్‌ కస్టడీ 

పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూని న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి అప్పగించింది. రిపబ్లిక్‌ డే రోజున దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్‌ సందర్భంగా.....

Published : 09 Feb 2021 20:48 IST

దిల్లీ: పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూని న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి పంపిస్తూ ఆదేశించింది. రిపబ్లిక్‌ డే రోజున దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్‌ సందర్భంగా చారిత్రక ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు దీప్‌సిద్ధూను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో ఆయనే హింసకు ప్రేరేపించినట్టు పోలీసులు తెలిపారు. 10 రోజుల పాటు రిమాండ్‌ కోరిన పోలీసులు.. రైతులు ట్రాక్టర్లతో బారికేడ్లను ధ్వంసం చేసేలా రెచ్చగొట్టడంతో పాటు అనుమతించిన రూట్‌నుంచి వారిని దీప్‌సిద్ధూ తప్పుదారి పట్టించినట్టు వివరించారు.  

ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా దిల్లీలో హింసకు దారితీయడం వెనుక ప్రధానంగా దీప్‌సిద్ధూ హస్తం ఉందంటూ ఆరోపణలు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ఆయన ఆచూకీ చెప్పినవారికి రూ.లక్ష రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌- అంబాలా మధ్యలోని జిరాక్‌పూర్‌ ప్రాంతంలో దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేసినట్టు డిప్యూటీ కమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.
ఇదీ చదవండి..
ఎర్రకోట ఘటన: దీప్‌సిద్ధూ అరెస్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని