Maharashtra: నాందేడ్ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగుల మృతి
నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరిగింది. సోమవారం 24 మంది చనిపోగా.. అర్థరాత్రి మరో ఏడుగురు రోగులు మరణించారు.
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి (Nanded Govt Hospital)లో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 24 గంటల వ్యవధిలో 12 మంది శిశువులు, చిన్నారులు సహా 24 మంది రోగులు చనిపోగా.. అర్థరాత్రి మరో ఏడుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులున్నారు. దీంతో ఆస్పత్రిలో గడచిన 48 గంటల వ్యవధిలో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. ఈ మరణాలపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ అంశంపై విపక్షాలు మహారాష్ట్ర సర్కారు తీరును తప్పుపట్టాయి. మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
మరోవైపు రోగుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి డీన్ శంకర్రావు చవాన్ తెలిపారు. పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అలాగే, మందుల కొరతతో రోగులు మరణించినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. చాలా మంది రోగులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారని, దీనికి తోడు వైద్యం అందడంలో జాప్యం ఫలితంగా.. చికిత్సకు స్పందించే పరిస్థితి దాటిపోవడంతో మరికొంతమంది చనిపోయారని తెలిపారు. సోమవారం మృతిచెందిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారని మహారాష్ట్ర వైద్య విద్య, పరిశోధన విభాగం సంచాలకుడు దిలీప్ మైశేఖర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kapil Sibal: అస్సాం మయన్మార్‌లో భాగమేనట: కపిల్ సిబల్ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన హిమంత
Kapil Sibal: ‘అస్సాం (Assam)’పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రంగా ఖండించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడొద్దంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇంతకీ కపిల్ సిబల్ ఏమన్నారంటే..? -
Vegan Technology: ‘శాకాహార’ సంచులు, పాదరక్షలు!
తోలుకు ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేసే విధానాన్ని తిరువనంతపురానికి చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్) అభివృద్ధి చేసింది. -
Supreme Court: జడ్జీలు తీర్పుల్లో ఉపదేశాలివ్వరాదు: సుప్రీం
తాము వెలువరించే తీర్పుల్లో జడ్జీలు వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం కానీ, ఉపదేశాలివ్వడం కానీ చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. -
ఉత్తరాది రాష్ట్రాలది గోముద్ర!: డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందన
ఉత్తరాది రాష్ట్రాలు ‘గోమూత్రాని’కి నిదర్శనం కాదని, వాటిది ‘గోముద్ర’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అవి పవిత్ర గోమాతకు చిహ్నమని తెలిపారు. -
అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదు
దేశంలోని బంధుప్రీతి, అవినీతి, కులతత్వం స్థానాలను గత పదేళ్లలో అభివృద్ధితో భర్తీ చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. -
తొలి బుల్లెట్రైలు స్టేషన్ అదరహో!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ‘ఎక్స్’ ద్వారా పంచుకొన్నారు. -
ష్.. పేరెంట్ - టీచర్ మాట్లాడుకొంటున్నారు!
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తన పోస్టుల్లో చమత్కారం ఉంటుంది. తాజాగా స్మృతి నెట్టింట్లో చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. -
బెంగాల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 9 మంది నవజాత శిశువుల మృతి
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 9 మంది నవజాత శిశువులు మృతిచెందడం కలకలం రేపుతోంది. -
వెడ్ ఇన్ ఇండియా.. మీరే ప్రారంభించాలి
భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. యువ జంటలు ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సూచించారు. -
మోదీకే అత్యధిక ప్రజామోదం
ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. -
వచ్చే ఏడాది మార్చి వరకు.. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయడానికి, తగిన నిల్వలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. -
నెలసరి సెలవులపై ప్రతిపాదనలు పరిశీలనలో లేవు
నెలసరి సెలవును ప్రకటించే ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని కేంద్రం స్పష్టం చేసింది. -
గుజరాత్లో ఏడాదిన్నరగా నకిలీ టోల్‌ప్లాజా
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఘరానామోసం ఆలస్యంగా బయటపడింది. మోర్బీ, కచ్ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్‌ప్లాజా ఉంది. -
గంటల వ్యవధిలో 4 రాష్ట్రాల్లో భూప్రకంపనలు
నాలుగు రాష్ట్రాల్లో శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలోనే భూప్రకంపనలు సంభవించడం కలకలం రేపింది. -
ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి
ఊయలలో పడుకోబెట్టిన ఆరు నెలల చిన్నారి ముఖంపై గేదె పేడ వేసింది. దీంతో ఊపిరాడక ఆ బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యయానికి పరిమితి విధించాలన్న పిటిషన్ తిరస్కరణ
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వ్యయానికి పరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. -
విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం
విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
హరియాణా ఎమ్మెల్యే - ఐఏఎస్‌ల పెళ్లికి 3 లక్షల మందికి ఆహ్వానాలు
హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిని మనువాడనున్నారు. -
ఎగుమతి పరపతిపై జూన్ దాకా రాయితీ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పవనాలు వీస్తున్న వేళ భారతీయ ఎగుమతిదారులకు తోడ్పాటు కొనసాగించేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. -
సూర్యుడి అరుదైన చిత్రాలను క్లిక్‌మనిపించిన ఆదిత్య-ఎల్1
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. తాజాగా కొన్ని అరుదైన చిత్రాలను పంపింది. -
జ్ఞానవాపి మసీదుపై ముగిసిన వాదనలు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని గుడిని ‘పునరుద్ధరించాలంటూ’ దాఖలైన పిటిషన్ విచారణయోగ్యతపై అలహాబాద్ హైకోర్టు వాదనలను ముగించింది.


తాజా వార్తలు (Latest News)
-
Gautham Gambhir: మా ఆటగాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే : గంభీర్
-
Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్‌ను కట్ చేసిన సీఎం రేవంత్
-
KCR: భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
-
Bhagavanth Kesari: అలా చేసి ఉంటే.. ‘భగవంత్ కేసరి’ దెబ్బతినేది: పరుచూరి గోపాలకృష్ణ
-
TS News: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు
-
Kishan Reddy: భాజపా ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి భేటీ.. సభకు వెళ్తారా? లేదా?