ఘోరం: నదిలో పడిన వాహనం.. ఏడుగురు జవాన్లు దుర్మరణం

లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం నదిలో పడి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 19 మంది గాయపడ్డారు

Updated : 27 May 2022 21:47 IST

శ్రీనగర్‌: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం నదిలో పడి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పార్థాపూర్‌ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

టుర్టుక్‌ సెక్టార్‌ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారి శ్యోక్‌ నదిలో పడింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌ అంబులెన్స్‌లో సైనికులను పశ్చిమ కమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. 

తీవ్ర మనోవేదనకు గురిచేసింది.. దీదీ
ఈ మధ్యాహ్నం లద్దాఖ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వీర సైనికులు మరణించిన ఘటన తీవ్ర వేదినకు గురిచేసిందని బెంగాల్‌ సీం మమతా బెనర్జీ అన్నారు.  ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని ట్విటర్‌లో పేర్కొన్నా ఆమె.. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని