- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Corona: 7 రాష్ట్రాల్లో 10% దాటిన పాజిటివిటీ రేటు.. కేంద్రం అలర్ట్
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజలుగా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10శాతం దాటడం కలవరపెడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ ఆయా రాష్ట్రాలను సూచించింది.
దిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం దాటింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. ‘‘వైరస్ వ్యాప్తి కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని తప్పనిసరిగా అమలు చేయండి. అర్హులైన ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయండి. కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడండి’’ అని భూషణ్ లేఖలో సూచించారు. రాబోయేవి పండగ రోజులు కావడంతో సామూహిక కార్యక్రమాలు జరుగుతాయని, దీంతో కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదముందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అందువల్ల రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దేశంలో గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు దాదాపు 20వేలుగా నమోదవుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 19,406 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. 49 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ఆరు నెలల తర్వాత మళ్లీ 2వేల కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ రోజువారీ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. తమిళనాడు, కేరళల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
-
Politics News
Kejriwal: ‘ఆప్‌ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు
-
Sports News
Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!
-
Movies News
Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
-
World News
China: జననాల రేటుపై చైనా కలవరం.. యువ జంటలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు..
-
General News
Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- RRR: ఆస్కార్‌కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- ప్రభాస్ ‘సలార్’- హృతిక్ ‘ఫైటర్’ ఢీ కొంటే!
- Telangana News: నాగార్జునసాగర్ డ్యామ్‌పై ప్రమాదం.. విరిగిన క్రస్ట్‌గేట్ ఫ్యాన్
- Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్