Bus Accident: ఘోరం.. బస్సు లోయలో పడి 10 మంది యాత్రికులు దుర్మరణం

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌ నుంచి యాత్రికులతో కత్రా వెళ్తున్న బస్సు జమ్మూ దగ్గర ఓ లోయలో పడింది.

Updated : 30 May 2023 10:08 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తోన్న బస్సు లోయలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. (Bus falls in gorge)

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ (Amritsar) నుంచి కొంతమంది యాత్రికులు జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి (Mata Vaishno Devi shrine) ఆలయాన్ని దర్శించుకునేందుకు బస్సులో బయల్దేరారు. వైష్ణోదేవి ఆలయ బేస్‌ క్యాంప్‌ అయిన కత్రాకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఝజ్జర్‌ కొట్లి ప్రాంతంలో జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై బస్సు అదుపుతప్పింది. రోడ్డుపై నుంచి జారి లోయలో పడింది. మరికొద్ది సేపట్లో గమ్యస్థానాన్ని చేరాల్సి ఉండగా.. కత్రా బేస్‌క్యాంప్‌నకు 15 కి.మీల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బస్సు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 75 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 55 మంది గాయపడ్డారు. ప్రస్తుతం బస్సు నుంచి అందరినీ వెలికితీసి కాపాడినట్లు జమ్మూ ఎస్‌ఎస్‌పీ చందన్‌ కోహ్లీ తెలిపారు. ప్రమాదంపై జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు