
Published : 17 Feb 2021 21:25 IST
ఉత్తరాదిపై మంచు దుప్పటి
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో దట్టంగా పొగ మంచు అలముకొంది. ఫలితంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘు వద్ద పొగమంచు కారణంగా దృశ్య నాణ్యత పడిపోయింది. లైట్లు ఉన్నప్పటికీ ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. శీతల గాలుల కారణంగా దిల్లీలో ఉష్ణోగ్రతలు 12.6 డిగ్రీలకు పడిపోయాయి. పంజాబ్లోని బటాలాలో సైతం దట్టమైన పొగమంచు ఏర్పడింది. చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు.
ఇవీ చదవండి
Tags :