Har Ghar Tiranga: ఇంటింటా హర్‌ ఘర్‌ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగరవేసిన అమిత్‌ షా

స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు గడుస్తోన్న వేళ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం కింద హర్‌ఘర్ తిరంగా ఉత్సవంలో దేశప్రజలు పాల్గొంటున్నారు.

Updated : 13 Aug 2022 12:12 IST

దిల్లీ: స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు గడుస్తోన్న వేళ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం కింద హర్‌ఘర్ తిరంగా ఉత్సవంలో దేశప్రజలు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా  ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఇతర మంత్రులు, ప్రజలు తమ ఇళ్లపై జెండా ఎగరేశారు. అమిత్‌ షా తన సతీమణితో కలిసి ఈ వేడుకలో పాల్గొన్న దృశ్యాలను భాజపా ట్విటర్‌లో షేర్ చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గువాహటిలో ర్యాలీకి నాయకత్వం వహించారు. ‘ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు నేను దేశ ప్రజలతో కలిసి నడిచాను’ అని ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ వెల్లడించారు. ఆయన కొచ్చిలోని తన ఇంటివద్ద జెండాను ఎగరవేశారు. మరో నటుడు మమ్ముట్టి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. సరిహద్దు దళం ఐటీబీపీ కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. 







Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని