Sharad Pawar: మోదీతో భేటీ.. పవార్ ఏం చెప్పారంటే..?

బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీ, ఎన్‌సీపీ అధినేత మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 06 Apr 2022 19:44 IST

దిల్లీ: బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీ, ఎన్‌సీపీ అధినేత మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, తమ మధ్య చర్చకు వచ్చిన విషయాలను పవార్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థలు చేస్తోన్న దాడుల గురించి ప్రస్తావించినట్లు వెల్లడించారు. 

‘శివసేన నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయాన్ని నేను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాను. ఇది అన్యాయం గాక మరొకటి కాదని చెప్పాను. ఆయన రాజ్యసభ సభ్యుడు. సీనియర్ జర్నలిస్టు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ అవసరం ఏముంది?’ అని పవార్ వ్యాఖ్యానించారు.  

అలాగే ఈ సందర్భంగా యూపీఏకు నాయకత్వం వహిస్తారా..? అంటూ మీడియా అని అడిగిన ప్రశ్నకు ఆయన్నుంచి మునుపటి సమాధానమే వచ్చింది. ‘ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాను. ఈ బాధ్యత తీసుకునే విషయంలో నేను ఆసక్తిగా లేను’ అని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అగాఢీ(మహారాష్ట్ర అధికార కూటమి) మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని