పొత్తికడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన పవార్

రాజకీయ కురువృద్ధుడు, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు.

Published : 29 Mar 2021 11:50 IST

ముంబయి: రాజకీయ కురువృద్ధుడు, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు. పొత్తికడుపులో నొప్పి కారణంగా అసౌకర్యానికి గురైన ఆయన్ను ఆదివారం సాయంత్రం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ నిన్న సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో ఇబ్బందిపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు..పిత్తాశయం(గాల్‌బ్లాడర్‌)లో ఆరోగ్య సమస్య ఉందని తెలిపారు’ అని మాలిక్ ట్వీట్ చేశారు. బుధవారం ఆయనకు శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందన్నారు. తదుపరి సమాచారం అందేవరకు..ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు రద్దయ్యాయని వెల్లడించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పవార్ మధ్య రహస్య సమావేశం జరిగిందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు, అమిత్‌ షా ఆ సమావేశం గురించిన వార్తలపై స్పందిస్తూ..‘ప్రతిదీ బయటకు చెప్పలేం కదా’ అని బదులిచ్చారు. ఆయన మాట్లాడిన తీరు మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు