Sharad Pawar: మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌ షోలు నిర్వహించిన నియోజకవర్గాల్లో మహా వికాస్ అఘాడీ విజయం సాధించిందని ఎన్సీపీ (ఎస్‌సీపీ) నేత శరద్ పవార్ అన్నారు. 

Published : 15 Jun 2024 17:17 IST

ముంబయి: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఎక్కడెక్కడ రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో ఆ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) విజయకేతనం ఎగురవేసిందని ఎన్సీపీ (ఎస్‌సీపీ) నేత శరద్ పవార్(Sharad Pawar) అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమికి మద్దతిచ్చినందుకు ప్రజలకు తమ కృతజ్ఞతలు తెలపడానికి ఎస్‌సీపీ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray), పృథ్వీరాజ్ చవాన్‌(Prithviraj Chavan) శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులోభాగంగా  శరద్‌ పవార్ మాట్లాడుతూ “ప్రధానమంత్రి రోడ్‌షోలు నిర్వహించిన ప్రతిచోటా మేము గెలిచాము. అందుకే ప్రజలతో పాటు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మా గెలుపు కోసం ప్రచారం చేసిన మోదీకి ధన్యవాదాలు’’ అని ఆయన పేర్కొన్నారు.

శివసేన, ఎన్సీపీలో చీలికలు వచ్చిన అనంతరం అజిత్ పవార్‌- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భాజపాతో జట్టు కట్టింది. కాబట్టి తమ నుంచి విడిపోయిన ఆయన బంధువు అజిత్ పవార్‌ని తిరిగి తన పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని శరద్‌ పవార్ తేల్చిచెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని