శరద్‌ పవార్‌కు సర్జరీ, నిలకడగా ఆరోగ్యం!

అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌కు శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ముంయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

Published : 13 Apr 2021 01:08 IST

ముంబయి: అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌కు శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఎన్‌సీపీ నేతలు వెల్లడించారు. ‘పిత్తాశయం (గాల్‌బ్లాడర్‌)లో సమస్య కారణంగా మా పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్‌ బల్సారా ఆయనకు లాప్రోస్కోపి ఆపరేషన్‌ చేశారు. అది విజయవంతమైంది’ అని ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ వెల్లడించారు. ప్రస్తుతం పవార్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని..ఆయన కోలుకుంటున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతోన్న శరద్‌పవార్ రెండు వారాల క్రితం ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరారు. మార్చి 30న ఎండోస్కోపీ ద్వారా పవార్‌ పైత్యవాహికలోని రాయిని తొలగించారు. రెండు వారాల అనంతరం మరో సర్జరీ చేయాలని.. అప్పటివరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇందులో భాగంగా సోమవారం ఆయనకు గాల్‌బ్లాడర్‌ ఆపరేషన్‌ నిర్వహించగా విజయవంతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని