Updated : 06/12/2021 14:10 IST

Parliament: ఎంపీల సస్పెన్షన్‌ వివాదం.. సంసద్‌ టీవీ నుంచి తప్పుకొన్న శశిథరూర్‌

దిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలకు మద్దతుగా కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంసద్‌ టీవీ షోల నుంచి ఆయన తప్పుకొన్నారు. ఈ మేరకు థరూర్‌ ట్విటర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. సంసద్‌ టీవీలో ప్రసారమవుతున్న ‘టు ది పాయింట్’ అనే చర్చా వేదికకు థరూర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఎంపీల సస్పెన్షన్‌ నేపథ్యంలో ఈ షో నుంచి తప్పుకొంటున్నట్లు థరూర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంపీలపై వేటు ఎత్తివేసే వరకూ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోనని స్పష్టం చేశారు. అంతకుముందు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది కూడా సంసద్‌ టీవీ యాంకర్‌గా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద సస్పెన్షన్‌ వేటు వేసింది. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

అయితే ఈ సస్పెన్షన్‌పై గతవారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని, ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఛైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘సభ్యుల ప్రవర్తనపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం సభకు ఉంటుంది. ఒకసారి వర్షాకాల సమావేశాల చివరిరోజు రికార్డులను పరిశీలించండి. మీరు సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని