Malfeasance: వారి గురించే ఆలోచిస్తున్నారు... అందుకే వారు మాల్‌ఫీజన్స్‌..

నెహ్రూపై భాజపా చేస్తోన్న విమర్శలను ట్వీట్‌ చేస్తూ ఓ నెటిజన్‌ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు ఓ ప్రశ్న సంధించారు.  దానికి ఆయన.. తనదైన శైలిలో జవాబిచ్చారు. 

Updated : 12 Feb 2023 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) ఆంగ్ల పద వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన.. వివిధ అంశాలపై స్పందిస్తూ ఆసక్తికరమైన ఆంగ్లపదాలను ఉపయోగిస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు జవాబుగా మరో ఆంగ్లపదాన్ని వాడారు.

గతంలో మహారాష్ట్ర - కర్ణాటక రాష్ట్రా సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర మంత్రి, భాజపా నేత సుధీర్‌ ముంగంటివార్ మాట్లాడుతూ.. ఈ వివాదానికి భారత తొలి ప్రధాని, కాంగ్రెస్‌ నేత జవహర్‌లాల్‌ నెహ్రూ (Nehru) కారణమని చెప్పారు. ఈ వార్తకు సంబంధించిన ఫొటోను అను మిత్తల్‌ అనే నెటిజన్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘పాకిస్థాన్‌ సమస్యలు, కశ్మీర్‌ వివాదాలు, చైనా చొరబాటు, మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు, ద్రవ్యోల్బణం ఇలా అన్నింటికీ నెహ్రూనే కారణమని నిందిస్తున్నారు. ఇలా నెహ్రూ గురించే ఆలోచించేవారికోసం ఏదైనా పదముందా?’ అంటూ శశిథరూర్‌ను ప్రశ్నించారు.

దానికి శశిథరూర్‌ స్పందిస్తూ.. ‘మాల్‌ఫీజన్స్‌ (Malfeasance)’ అని జవాబిచ్చారు. దీనికర్థం అక్రమం. ముఖ్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు అక్రమాలు చేస్తున్నప్పుడు ఈ పదాన్ని వాడుతారు. భాజపా నేతలు నెహ్రూ గురించి అక్రమంగా మాట్లాడుతున్నారని శశిథరూర్‌ పరోక్షంగా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని