Shashi Tharoor: మోదీ గడ్డంపై థరూర్ సెటైర్
శశిథరూర్ ఆంగ్ల భాషా పరిజ్ఞానం గురించి తెలిసిందే. ఈ కేరళ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతుంటే నిఘంటువు వెతుక్కోవాల్సిందే.
దిల్లీ: శశిథరూర్ ఆంగ్ల భాషా పరిజ్ఞానం గురించి తెలిసిందే. ఈ కేరళ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతుంటే నిఘంటువు వెతుక్కోవాల్సిందే. తాజాగా ఆయన ‘పొగోనోట్రోఫీ’ అనే పదం వాడి ట్విటర్లో హల్చల్ సృష్టించారు. ఈ పదంతో ప్రధాని మోదీ గడ్డానికి లంకె పెట్టారు. పొగోనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం. కరోనా సమయంలో మోదీ కూడా పొగోనోట్రోఫీయే చేస్తున్నారంటూ థరూర్ వ్యంగ్యాస్త్రం విసిరారు. ఓ కొత్త పదం నేర్పాలంటూ ట్విటర్లో ఓ వైద్యురాలు అడిగిన ప్రశ్నకు థరూర్ బదులిసూ- ‘‘నా స్నేహితుడు, ఆర్థికవేత్త రతిన్రాయ్ ఈ రోజు నాకు ఓ కొత్త పదం నేర్పించారు. పొగోనోట్రోఫీ. అంటే గడ్డం పెంచడం. మహమ్మారి వేళ ప్రధానికి కూడా పొగోనోట్రోఫీ వ్యాపకంగా మారింది’’ అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్