Shashi Tharoor: ట్రోలర్స్‌కు శశిథరూర్‌ పంచ్‌.. ‘నాకు అందరూ సమానమే’

‘మహిళా ఎంపీలు ఉండగా.. లోక్‌సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ సోమవారం ట్వీట్‌ చేసిన పోస్ట్‌ వివాదస్పదమైన సంగతి తెలిసిందే.పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజు లోక్‌సభ ప్రాంగణానికి చేరుకున్న మహిళా ఎంపీలతో దిగిన సెల్ఫీని ట్వీట్‌ చేశారు. ఇందులో సుప్రియా సూలే, ప్రణీత్‌ కౌర్‌, తమిజాచి తంగపాండియన్‌, మిమి చక్రవర్తి, నుస్రత్‌ జహాన్‌, జ్యోతిమణి ఉన్నారు...

Updated : 30 Nov 2021 21:58 IST

దిల్లీ: ‘మహిళా ఎంపీలు ఉండగా.. లోక్‌సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు?’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ సోమవారం చేసిన ట్వీట్‌ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజు లోక్‌సభ ప్రాంగణానికి చేరుకున్న మహిళా ఎంపీలతో దిగిన సెల్ఫీని ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. ఇందులో సుప్రియా సూలే, ప్రణీత్‌ కౌర్‌, తమిజాచి తంగపాండియన్‌, మిమి చక్రవర్తి, నుస్రత్‌ జహాన్‌, జ్యోతిమణి ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ మహిళా నేతల మధ్యలో శశిథరూర్‌ నిలబడ్డారు. ఈ ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే వైరల్‌ అయింది. మహిళలను అగౌరవపరిచే విధంగా శశిథరూర్‌ మాట్లాడారని కొందరు, మహిళల పట్ల వివక్ష భావనతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ ఇంకొందరు నెటిజన్లు మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని థరూర్‌ విజ్ఞప్తి కూడా చేశారు. అంత సద్దుమణిగిందకునేలోపే మరుసటి రోజు.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల రెండో రోజు శశిథరూర్‌ పురుషులతో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ‘‘ ఈరోజు పార్లమెంట్‌ ప్రాంగణంలో మరింత మంది సహచర ఎంపీలను కలిశాను. కానీ, ఇది మాత్రం వైరల్‌ అవుతుందని ఎవ్వరూ ఊహంచరు. అందరినీ సమాన భావనతోనే చూస్తా’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని