పాలక్కడ్‌లోఏడాది చిన్నారికి షిగెల్లా

కేరళలోని పాలక్కడ్‌లో తొలి షిగెల్లా కేసు బయటపడింది. ఏడాది వయసు చిన్నారికి షిగెల్లా

Published : 21 Feb 2021 12:49 IST

పాలక్కడ్‌:  కేరళలోని పాలక్కడ్‌లో తొలి షిగెల్లా కేసు బయటపడింది. ఏడాది వయసు చిన్నారికి షిగెల్లా నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాధి సోకిన పసికందు మొదట చికిత్సకు సరిగా స్పందించలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం కోజికోడ్‌ ఆసుపత్రికి వెంటిలేటర్‌ సాయంతో తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మెరుగైనట్లు తెలిపారు. అంతకుముందు.. కోజికోడ్, ఎర్నాకులంలోనూ పదుల సంఖ్యలో షిగెల్లా కేసులు వెలుగుచూశాయి ఇప్పుడు పాలక్కడ్‌ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త కేసు నమోదైన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని కోరింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని