MLAs Dance: మహారాష్ట్ర సీఎంగా శిందే.. ఎగిరి గంతులేసిన రెబల్ ఎమ్మెల్యేలు
వైరల్‌గా మారిన వీడియోలు
ముంబయి: మహారాష్ట్రలో (Maharashtra) నెలకొన్న రాజకీయ అస్థిరతకు అనూహ్య పరిణామాలతో చివరకు ముగింపు పడింది. ఏక్నాథ్ శిందే (Eknath Shinde)కు పూర్తి మద్దతు ఇవ్వడంతోపాటు ఆయనే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించడం రెబల్ ఎమ్మెల్యేలతో పాటు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తను మీడియాలో చూసిన శిందే వర్గం ఎమ్మెల్యేలు సంతోషంతో ఉబ్బితబ్బిపోయారు. గోవా హోటల్లో ఉన్న రెబల్ నేతలంతా ఈ వార్త విని ఎగిరి గెంతులేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా టేబుళ్లపైకి ఎక్కి నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు తొలుత గుజరాత్, అక్కడనుంచి అస్సాం హోటళ్లలో క్యాంపు వేశారు. తొమ్మిది రోజుల అనంతరం.. తాజాగా బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారంతా ముంబై రావాలని నిశ్చయించుకున్నారు. దీంతో తమ క్యాంపును గుహవాటి నుంచి గోవాలోని ఓ హోటల్‌కు మార్చారు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. రెబల్ నేతలు గోవాలోనే ఉండిపోవడంతో వారికి నాయకత్వం వహిస్తోన్న ఏక్నాథ్ శిందే మాత్రం గురువారం మధ్యాహ్నం ముంబయికి చేరుకున్నారు. తొలుత భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌తో చర్చించిన అనంతరం గవర్నర్‌ను కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందేనే ప్రమాణస్వీకారం చేస్తారని ఫడణవీస్ ప్రకటించడంతో రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎంగా ఫడణవీస్.. ఉపముఖ్యమంత్రిగా శిందే ఉంటారనే ఊహాగాలు వచ్చినప్పటికీ.. చివరకు శిందేనే సీఎం కావడంతో రెబల్ ఎమ్మెల్యేలు సంతోషంతో ఎగిరి గంతులేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
-
Sports News
Roger Federer : రోజర్ ఫెదరర్.. ఐదేళ్ల కిందట హామీ.. తాజాగా నెరవేర్చి..
-
Politics News
Kejriwal: ఒకే ఒక్క అడుగు.. అది వేస్తే మనమూ సాధించినట్లే..!
-
General News
Wayanad Collector: ఇంట్లో ఉండటం చాలా కష్టం..! విద్యార్థిని ఈమెయిల్ వైరల్
-
General News
TTD: ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. తితిదే విజ్ఞప్తి
-
India News
UP: మహిళపై వేధింపులు.. పరారీలో ఉన్న భాజపా నేత అరెస్టు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్
- CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరజ్ చోప్రా