ncb - shiva sena: ఎన్‌సీబీపై సుప్రీంకోర్టుకు శివసేన!

ముంబయి క్రూయిజ్‌ నౌకలో మాదకద్రవ్యాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరు(ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేశారు. అయితే, ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తుంటే

Updated : 07 Dec 2021 14:03 IST

దిల్లీ: ముంబయి క్రూజ్‌ నౌకలో మాదకద్రవ్యాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేశారు. అయితే, ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తుంటే.. బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును ఎన్‌సీబీ కోరుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్‌సీబీ వ్యవహారశైలిపై శివసేన నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీపై న్యాయవిచారణ జరపాలని కోరుతూ శివసేన నేత కిశోర్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్యన్‌ఖాన్‌ ప్రాథమిక హక్కులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. 

‘‘ముంబయి ఎన్‌సీబీలో జరుగుతున్న అవినీతి, వారి వ్యవహరిస్తున్న తీరు ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఎన్‌సీబీ అధికారులు గత రెండేళ్లుగా కేవలం సినిమా సెలబ్రిటీలు, మోడల్స్‌ను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు నిజాలు బయటపడటానికి ప్రత్యేక న్యాయ విచారణ జరపాలని కోరుతున్నాం’’అని కిశోర్‌ తివారీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అక్టోబర్‌ 2న ముంబయి సమీపంలో క్రూజ్‌ నౌకలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయ్యాడు. ప్రస్తుతం ఆర్యన్‌ఖాన్‌.. ఆర్థర్‌ రోడ్‌ జైల్‌లో ఉన్నాడు. ఆయనకు బెయిల్‌ ఇచ్చే అంశంపై తీర్పును ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ నెల 20న బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని