Video: చిన్నారులతో స్టెప్పులేసి.. సతీమణితో కలిసి పాట పాడిన సీఎం

కొవిడ్‌(COVID) కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(Shivraj Singh chauhan) ఈఏడాది దీపావళి వేడుకలు(Diwali Celebrations) జరుపుకొన్నారు.

Published : 23 Oct 2022 18:12 IST

భోపాల్‌: కొవిడ్‌(COVID) కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(Shivraj Singh chauhan) ఈ ఏడాది దీపావళి వేడుకలు(Diwali Celebrations) జరుపుకొన్నారు. భోపాల్‌లోని తన నివాసానికి చిన్నారులను ఆహ్వానించిన సీఎం దంపతులు వారితో కలిసి ఆనందంగా గడిపారు. ఆ చిన్నారులతో కలిసి దీపాలు వెలిగించారు. అనంతరం వారితో సహపంక్తి భోజనం చేశారు. కొందరు చిన్నారులకు ఆయనే స్వయంగా తినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం శివరాజ్‌సింగ్‌ పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తూ వారిని మరింత ఉల్లాసపరిచారు. అనంతరం కచేరి కార్యక్రమంలో తన సతీమణి సాధనా సింగ్‌తో కలిసి సీఎం గీతం ఆలపించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. 

సీఎం కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమంలో దాదాపు 315మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకల అనంతరం చిన్నారులు తమ ఆనందాన్ని పంచుకొని సీఎం దంపతులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిన్నారులతో దీపావళి వేడుకలు జరుపుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని సీఎం తెలిపారు. అయితే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇలాంటి వేడుకలను చిన్నారులతో కలిసి చేసుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. గతేడాది దీపావళి వేడుకలు, ఈ ఏడాది రక్షా బంధన్‌ వేడుకలు కూడా వారి సమక్షంలోనే నిర్వహించి వారిపట్ల తన ప్రేమను చాటుకున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని