Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్‌

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్ దిల్లీ నుంచి భోపాల్‌కు రైల్లో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. సెల్ఫీలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 16 Jun 2024 14:18 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్(Shivraj Singh Chouhan) దిల్లీ నుంచి భోపాల్‌(Bhopal)కు వెళ్లారు. నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆయన తన సతీమణితో కలిసి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌(Shatabdi Express)లో ప్రయాణించారు. తమతో కలిసి ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రిని చూడగానే ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఆయనతో సెల్ఫీలు దిగారు.

తన రైలు ప్రయాణ అనుభవాలను, ఆ ఫొటోలను చౌహాన్‌ ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో మంత్రి అశ్విని వైష్ణవ్ కృషితో భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ శాఖ నిరంతరం శ్రమిస్తోందని అభివర్ణించారు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేంద్రమంత్రి నిరాడంబరతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌కు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిశ(Vidisha) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన 8.2 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మోదీ 3.0 మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని