Updated : 13 Jun 2021 14:31 IST

Maharashtra: కాంట్రాక్టర్‌పై చెత్త వేయించిన శివసేన ఎమ్మెల్యే

ముంబయి: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే దిలీప్‌లాండే అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. ఓ పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు ఆయన బహిరంగంగా శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబయి సహా పలు ప్రాంతాల్లో వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన చాంద్‌వాలి ఎమ్మెల్యే దిలీప్‌ లాండే.. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిలో కాంట్రాక్టర్‌ను కూర్చోబెట్టి పారిశుద్ధ్య కార్మికులతో అతడిపై చెత్త వేయించారు. ఈ నిర్వాకాన్ని సమర్థించుకున్న శివసేన ఎమ్మెల్యే.. కాంట్రాక్టర్‌ పని సరిగా చేయలేదని మండిపడ్డారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts