అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు

Akash Ambani- Shloka Mehta: ముకేశ్‌ అంబానీ ఇంట మరోసారి సందడి వాతావరణం నెలకొంది. ఆ ఇంటికి ఆకాశ్‌- శ్లోకా దంపతులకు రెండో బిడ్డ రూపంలో వారసురాలు వచ్చింది. 

Published : 31 May 2023 22:37 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh ambani) ఇంటికి వారసురాలు వచ్చింది. ముకేశ్‌ పెద్ద కుమారుడు అకాశ్‌ అంబానీ (Akash Ambani), కోడలు శ్లోకా అంబానీ (Shloka) దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా అంబానీ బుధవారం ఇక్కడి ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. అంబానీ ఇంటికి వారసురాలు రావడడంతో ఆ ఇంట సంతోషం నెలకొంది.

 2019లో వీరికి వివాహం జరిగింది. 2020 డిసెంబర్‌లో ఈ జంట తొలి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కుమారుడికి రెండేళ్లు. ముంబయి ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో  బేబీ బంప్‌తో శ్లోకా కనిపించారు. వారం క్రితం ముంబయిలోని కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆకాశ్‌ అంబానీ రిలయన్స్‌ జియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని