Leave Letters:మా అమ్మ 5న చనిపోతారు.. సెలవివ్వండి! ఆశ్చర్యం కలిగిస్తోన్న టీచర్ల లీవ్ లెటర్స్
బిహార్‌లో కొందరు ఉపాధ్యాయులు రాసిన సెలవు చీటీ (లీవ్ లెటర్)లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
బిహార్‌లో కొందరు ఉపాధ్యాయులు రాసిన సెలవు చీటీ (లీవ్ లెటర్)లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆ వివరాలు.. బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు..‘మా అమ్మ ఈ నెల 5వ తేదీ రాత్రి 8 గంటలకు చనిపోతారు. అంత్యక్రియల కోసం.. 6, 7 తేదీల్లో సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి’ అని తన పాఠశాల ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
నాలుగు రోజుల తర్వాత నాకు ఆరోగ్యం పాడవుతుంది
బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్‌గౌరవ్.. త్వరలో తనకు ఆరోగ్యం పాడవ్వనుందని.. అందుకే ఈ నెల 4, 5 తేదీల్లో తనకు సెలవు ఇవ్వండి’ అని లేఖ రాశారు.
పెళ్లిలో బాగా తింటా.. కడుపు నొప్పి వస్తుంది..
కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు క్యాజువల్ లీవ్ కోసం..‘నేను పెళ్లికి వెళ్లాలి.. అక్కడ భోజనం బాగా చేస్తాను. కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకు ఈ నెల 7న లీవ్ మంజూరు చేయండి’అని కోరారు. ఇలాంటి వింత లీవ్ లెటర్‌లు రావడానికి సెలవు తీసుకోవడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలంటూ భాగల్‌పుర్ కమిషనర్ దయానిధన్ పాండే చేసిన ఉత్తర్వులే కారణమని తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Aditi Gautam: వైభవంగా ‘నేనింతే’ హీరోయిన్ వివాహం
-
Technology News
WhatsApp: వాట్సాప్‌లో భారీగా లిమిట్ పెంపు.. ఒకేసారి 30 నుంచి 100కి!
-
World News
Natasha Perianayagam: ఆమె ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిని
-
World News
Syria: భూకంపంలో ధ్వంసమైన జైలు.. ఐఎస్ ఉగ్రవాదులు పరార్..!
-
Politics News
Rahul Gandhi: వారి కోసం రూల్సే మార్చేశారు.. కేంద్రంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు