దీప్‌ సిద్ధూ: వెలుగులోకి కీలకాంశం!

రైతు ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూకు చెందిన వీడియోలను అప్‌లోడ్‌ చేసేది ఆయన స్నేహితురాలట.

Published : 06 Feb 2021 15:50 IST

విదేశాల్లో ఉన్న స్నేహితురాలితో ఫేస్‌బుక్ ఖాతా నిర్వహణ

దిల్లీ: రైతు ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూకు చెందిన వీడియోలను అప్‌లోడ్‌ చేసేది ఆయన స్నేహితురాలట. విదేశాల్లో ఉన్న ఆమె సిద్ధూ ఫేస్‌బుక్‌ ఖాతాను నిర్వహిస్తోందని గుర్తించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

‘దీప్‌ సిద్ధూ ఫేస్‌బుక్ ఖాతాను ఆయన స్నేహితురాలు చూసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న ఆమెకు సిద్ధూ వీడియోలు పంపితే..ఆమె వాటిని అప్‌లోడ్ చేస్తుంది’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోన్న రైతులు..నిరసనలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి, ఘర్షణలకు కారణమయ్యాడనే ఆరోపణలతో దీప్‌సిద్ధూపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను విడుదల చేశారు. ‘నేను దేశ ద్రోహినైతే..రైతు నాయకులు కూడా దేశ ద్రోహులే అవుతారు’ అంటూ దానిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా..ఎర్రకోట వద్ద ఘటనల తరవాత నుంచి ఆయన ఆచూకీ లభ్యం కావడంలేదు. ఆయన ఆచూకీ చెబితే దిల్లీ పోలీసులు రూ.లక్ష రివార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

నేను దేశ ద్రోహినైతే..: దీప్‌ సిద్ధూ

దీప్‌ సిద్ధూ ఎక్కడున్నాడో చెప్తే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని