సీరం ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణం

జనవరి 21న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూటే కారణమని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. ఈ ఘటనలో అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన శుక్రవారం వెల్లడించారు.

Published : 13 Feb 2021 01:51 IST

వెల్లడించిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి

ముంబయి: జనవరి 21న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన అగ్ని ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూటే కారణమని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. ఈ ఘటనపై అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన శుక్రవారం వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో నిర్మాణంలో ఉన్న ఆ భవనంలో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆ భవనంలోని నాలుగు, ఐదు, ఆరు అంతస్తులు పూర్తిగా కాలిపోయాయని ప్రధాన అగ్నిమాపకాధికారి ప్రశాంత్‌ తెలిపారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. వంద ఎకరాల్లో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ భవనంలో ఉన్న వెయ్యి కోట్ల రూపాయలు ఖరీదు చేసే పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయని సీరం సీఈవో అదర్‌పూనావాలా తెలిపారు. ఈ ఘటన వల్ల వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవ్వలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై పలు వదంతులు వ్యాప్తిస్తుండటంతో దాని కారణాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రమాదంపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు సేకరించామని అజిత్‌ పవార్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

దిగొచ్చిన ట్విటర్‌

చైనా..యూకే మీడియా యుద్ధం

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని