ఈ రాజ్యసభ సమావేశాలకో రికార్డు..!

కరోనా నేపథ్యంలో ఈ సారి జరిగిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఓ అరుదైన రికార్డు రాజ్యసభ సొంతమైంది. ఇప్పటి వరకు అత్యల్ప కాలం జరిగిన సభగా......

Published : 24 Sep 2020 00:55 IST

దిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ సారి జరిగిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఓ అరుదైన రికార్డు రాజ్యసభ సొంతమైంది. ఇప్పటివరకు అత్యల్ప కాలం జరిగిన సభల్లో ఒకటిగా నమోదైంది. ఈ నెల 14న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగా.. బుధవారం (22న) సభ నిరవధికంగా వాయిదా పడింది. వాస్తవానికి అక్టోబర్‌ 1 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో 8 రోజుల ముందుగానే సమావేశాలను ముగించారు. కేవలం 10 సిట్టింగులు మాత్రమే జరిగాయి. మొత్తం 25 బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాయి. దీంతో అత్యల్ప సమయం పాటు కొనసాగిన రెండో రాజ్యసభ వర్షాకాల సమావేశాలుగా ఇవి రికార్డులెక్కాయి. మొత్తంగా చూస్తేమాత్రం.. మూడో అత్యల్ప సమావేశంగా గుర్తింపు పొందినట్టు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకూ జరిగిన మొత్తం 252 పార్లమెంటు సమావేశాల్లో 89వ సెషన్​ (1974) 40 సిట్టింగ్‌లతో అతిపెద్ద వర్షాకాల సమావేశాలుగా రికార్డుల్లో నిలిచినట్లు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. 1979 ఆగస్టు 20న జరిగిన 111వ సెషన్  కేవలం ఒక్క సిట్టింగ్‌తోనే ముగిసింది. ఇక 1952 నుంచి ఇప్పటివరకూ నిర్వహించిన మొత్తంంగా 69 వర్షాకాల సమావేశాలు జరగ్గా.. అతి తక్కువ సిట్టింగ్‌లు జరిగిన వాటిల్లో  ప్రస్తుత సమావేశాలు రెండో స్థానంలో నిలిచాయి. 1979 జూలైలో నిర్వహించిన 110వ సెషన్​, 1999 అక్టోబర్‌లో నిర్వహించిన 187వ సమావేశాలు కేవలం 6 సిట్టింగ్‌లతోనే ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని