Ayodhya: అయోధ్య రామమందిరం..3డీ యానిమేషన్‌ వీడియోచూశారా?

పండుగ పర్వదినం లోహ్రి (భోగి)ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ వీడియోని విడుదల చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగే తీరును 3డీ యానిమేషన్‌ వీడియోను రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా పంచుకుంది. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో..

Published : 15 Jan 2022 01:59 IST

అయోధ్య: ఉత్తరాదిలో ఘనంగా నిర్వహించే లోహ్రి (భోగి) పండగను  పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ వీడియోని విడుదల చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగే తీరును 3డీ యానిమేషన్‌ వీడియో రూపంలో ట్విటర్‌ వేదికగా పంచుకుంది. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఆలయం పునాది నుంచి పైకప్పు వరకూ చూపించారు. అదే విధంగా ఆలయానికి చేరుకునే రోడ్డు మార్గం, గతంలో కట్టిన శ్రీరామ మందిరంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తోన్న రామ మందిరం.. తదితర దృశ్యాలను ఏరియల్‌ వ్యూలో చూపించారు.

2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులు పూర్తవ్వగా.. డిసెంబర్‌ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేర్కొంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను చేపడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని