Shweta Tiwari: దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన టీవీ నటి

ప్రముఖ టీవీ, సినీ నటి శ్వేతా తివారీ ఇటీవల దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాను నటిస్తున్న ఓ వెబ్‌ సీరిస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. ఈ వ్యవహారంపై...

Updated : 28 Jan 2022 17:20 IST

కేసు నమోదు చేసిన భోపాల్‌ పోలీసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టీవీ, సినీ నటి శ్వేతా తివారీ దేవుడిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాను నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. ఈ వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు వస్తుండటంతో.. తాజాగా ఆమె మౌనం వీడారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకుగానూ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తోటి నటుడు ఇదివరకు పోషించిన పాత్రను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయించినట్లు నా దృష్టికి వచ్చింది. సాధారణంగా ప్రేక్షకులు.. నటీనటులను పాత్రల పేర్లతో కనెక్ట్‌ చేస్తారు కాబట్టి, దీన్ని ఒక ఉదాహరణగా ఉపయోగించా. కానీ, దీన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడం బాధాకరం. భగవంతుడిని విశ్వసించే వ్యక్తిగా.. తెలిసీతెలియకుండా ఎప్పుడు అలాంటి పనులు చేయను. మాటలతో ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్య చాలా మందికి అనుకోకుండా బాధ కలిగించడంపై.. క్షమాపణలు కోరుతున్నా’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. శ్వేతా తివారీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా గురువారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని భోపాల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలతో మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ ఆమెపై భోపాల్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. శ్వేతా తివారీని అధికారికంగా అరెస్టు చేస్తామని, అయితే పోలీస్‌స్టేషన్ నుంచి బెయిల్ పొందొచ్చని స్థానిక ఏసీపీ బిట్టు శర్మ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని