ఆ నివేదిక బయటపెట్టకపోతే నిరాహార దీక్ష.. సొంత ప్రభుత్వానికే సిద్ధూ అల్టిమేటం!

డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన స్పెషల్‌ టాస్క్‌పోర్స్‌ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని చరణ్‌జిత్‌ చన్నీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ డిమాండ్‌ చేశారు.

Published : 25 Nov 2021 21:40 IST

చండీగఢ్‌ (పంజాబ్‌): డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన స్పెషల్‌ టాస్క్‌పోర్స్‌ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని పంజాబ్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ డిమాండ్‌ చేశారు. లేకుంటే నిరహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మోగాలో నిర్వహించిన సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘వేలాది మంది యువత డ్రగ్స్‌కు బలైపోయారు. ఎంతోమంది తల్లులు కుమారులను కోల్పోయారు. సిట్‌ నివేదిక బయటపెట్టకుండా ఏ కోర్టూ అడ్డుకోవడం లేదు. అయినా రిపోర్టును బయటపెట్టడానికి మీకు ఎవరు అడ్డుపడుతున్నారు’’ అంటూ సొంత ప్రభుత్వాన్ని సిద్ధూ ప్రశ్నించారు. అలాగే 2015 గురుగ్రంథ్‌ సాహిబ్‌ని అవమానపరిచిన కేసులో న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో అడ్వకేట్‌ జనరల్‌, డీజీపీ నియామకాల విషయంలోనూ చన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని సిద్ధూ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధూ.. తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా డ్రగ్స్‌ కేసులో సైతం అదే తరహా హెచ్చరికలకు దిగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని