Corona: 4లక్షలు దాటిన కొత్త కేసులు 

కరోనా కాటుతో యావత్‌ దేశం అల్లాడిపోతోంది. అలుపన్నదే లేకుండా దేశం నలుమూలలా వైరస్‌ విరుచుకుపడుతోంది. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు

Updated : 01 May 2021 10:43 IST

32లక్షలు దాటిన క్రియాశీల కేసులు

దిలీ: కరోనా కాటుతో యావత్‌ దేశం అల్లాడిపోతోంది. దేశం నలుమూలలా వైరస్‌ విరుచుకుపడుతోంది. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. 
అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు.

* 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 19,45,299 వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,993 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.91కోట్లకు చేరింది.

* ఇదే సమయంలో మరో 3523 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,11,853 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.11శాతంగా ఉంది.

* అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3లక్షల(2,99,988) మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.56కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.84శాతంగా ఉంది.

* ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 32లక్షలు దాటాయి. ప్రస్తుతం 32,68,710 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 17.06 శాతానికి పెరిగింది. 

* దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 27లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటివరకు 15.49కోట్ల మంది టీకా పొందారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని