India Corona: 5 నెలల తర్వాత.. 2 వేలు దాటిన కరోనా కేసులు

గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా(Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Published : 29 Mar 2023 11:10 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Corona Virus) మరోసారి గుబులు పుట్టిస్తోంది. గత కొద్ది నెలలుగా కట్టడిలో ఉన్న కొత్త కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,151 మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ(Union Health Ministry) వెల్లడించింది. గత ఐదు నెలలకాలంలో రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే మొదటిసారి. 

మంగళవారం 1,42,497 మందికి వైరస్(Corona Virus) నిర్ధారణ పరీక్షలు చేయగా.. రెండువేలకు పైగా కేసులు వచ్చాయి. గత అక్టోబర్ 28న 2,208 కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఇవే అత్యధికం. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 11,903కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 98.78 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.03గా ఉంది. మహారాష్ట్రలో మూడు, కర్ణాటకలో ఒకటి, కేరళలో మూడు మరణాలు నమోదయ్యాయి. మృతుల పరంగా కేరళ సవరించిన గణాంకాలను ప్రకటించింది. ఇప్పటివరకూ 220.65 కోట్ల టీకా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని