మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా
దేశంలో ఆ మధ్య తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి .. ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలో 14వేల పైన కొత్తకేసులు
దిల్లీ: దేశంలో ఆ మధ్య తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి .. ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికా, బ్రిటన్ రకం కరోనా వైరస్‌లు దేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,08,856కు చేరింది.
2లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు
ఓ వైపు కొత్తకేసులు పెరుగుతుండగా.. కోలుకునేవారు సంఖ్య తగ్గుతూ పోవడం మరింత కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 15,157 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మెత్తం 1,09,53,303 మంది కరోనాను జయించారు. అయితే ఆ మధ్య 97శాతం దాటిన రికవరీ రేటు.. ప్రస్తుతం 96.86శాతానికి పడిపోయింది. రికవరీలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ 2లక్షలకు చేరువైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,237 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.74శాతానికి పెరిగింది. ఇక 24 గంటల వ్యవధిలో మరో 117 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,58,306కు పెరిగింది.
కొవిడ్ గుప్పిట్లో మహారాష్ట్ర
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ఆ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఒక్కరోజే అక్కడ 14,317 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,66,374కు పెరిగింది. ఇక నిన్న మరో 57 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 1.9లక్షల క్రియాశీల కేసులుండగా.. అందులో లక్షకు పైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,070కి చేరింది. గతేడాది నవంబరు 6 తర్వాత మహారాష్ట్రలో క్రియాశీల కేసులు లక్ష దాటం మళ్లీ ఇప్పుడే. దీంతో అప్రపత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!