Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
బడ్జెట్ వేళ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman ) ధరించే చీరలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ ఐదేళ్లలో ఆమె విభిన్న వర్ణాలున్న చీరలు ధరించారు.
దిల్లీ: నేడు బడ్జెట్ పండగ. ఫిబ్రవరి ఒకటిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman ) కురిపించే వరాల జల్లు కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది ఈ ప్రత్యేకమైన రోజున ఆమె ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈ రోజు బడ్జెట్ ట్యాబ్‌తో ఎరుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు. ఆమె 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజున చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. ‘సిల్క్, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు నాకిష్టమైన వాటిలో ఒకటి. వాటి రంగు, నేతపని, ఆకృతి బాగుంటాయి’ అని వెల్లడించారు.
2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు. ఇది ఆమె నిరాడంబరతకు నిదర్శమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అలాగే 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు. ఇక 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకు వచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!