LAC: వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని అంచనా వేయలేం: ఆర్మీ చీఫ్
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉన్నా.. ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేమని ఆర్మీచీఫ్ జనరల్ మనోజ్‌పాండే పేర్కొన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉన్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆర్మీచీఫ్ జనరల్ మనోజ్‌పాండే పేర్కొన్నారు. ‘ది చాణక్య డైలాగ్స్’ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. వివాదాస్పదమైన ఏడు ప్రదేశాల్లో.. నాలుగు చోట్ల సమస్య పరిష్కారమైందని, మిగిలిన రెండింటిపై దృష్టిపెట్టామని తెలిపారు. కానీ, వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాల ఉపసంహరణ మాత్రం జరగడంలేదని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం రెండు పక్షాల మధ్య దౌత్య, రాజకీయ, సైనిక స్థాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి చర్చల వల్లే మనం ఐదు చోట్ల పరిష్కారాలు కనుగొన్నాం’’ అని పాండే చెప్పారు.
అక్టోబర్ 15వ తేదీన ఇండో-చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ డబ్ల్యూఎంసీసీ 25వ విడత సమావేశాల వివరాలను పాండే వెల్లడించారు. దీనిలో కోర్ కమాండర్ స్థాయిలో 17వ విడత భేటీ నిర్వహించడంపై చర్చలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. చర్చల వల్లే పరిష్కారం లభిస్తుందన్నారు. ‘‘కేవలం శిక్షణ కోసం వచ్చిన కొన్ని బ్రిగేడ్లు మాత్రమే వెనక్కివెళ్లాయి. ఎల్ఏసీని దృష్టిలో పెట్టుకొని చూస్తే మాత్రం పెద్దగా బలగాల సంఖ్యలో తగ్గుదల ఏమీ లేదు’’ అని పాండే వెల్లడించారు. భారత్ వైపు నుంచి మౌలిక వసతుల కల్పన , అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ అవసరమైన ప్రదేశాలకు వెంటనే అదనపు బలగాలను పంపడానికి ఏర్పాట్లు జరిగినట్లు వెల్లడించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రిజర్వు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అక్కడ టీమ్ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్
-
Movies News
Tollywood: విజయోత్సవం కాస్తా.. వివాదమైంది.. విమర్శల పాలైంది!
-
General News
sandoz: హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న శాండోస్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: నెల్లూరు జిల్లాలో వైకాపా కోటకు బీటలు.. పార్టీకి దూరమవుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
-
India News
Asaram Bapu: అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు